అపర్ణ మాలిక్ కథానాయికగా, అజయ్‌ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డెడ్ లైన్’. బొమ్మారెడ్డి వీఆర్ఆర్ దర్శకుడు. తాండ్ర గోపాల్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకానుంది. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి సమాజంలో ప్రతి స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటి యువత అభిరుచులకు అద్దం పట్టేలా ఉంటుంది’ అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయని, త్వరలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీకృష్ణ, సంగీతం: సబు నర్గీస్, నిర్మాణ సంస్థ: శ్రీవిఘ్నతేజ ఫిలింస్, దర్శకత్వం: బొమ్మారెడ్డి వీఆర్ఆర్.