‘సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ప్రాణం హాయిగా ఉంది’ అంటున్నారు కేరళ సోయగం ఐశ్వర్య లక్ష్మి. తాజా ఇంటర్వ్యూలో తాను చేస్తున్న సినిమాల గురించి, సోషల్ మీడియా గురించి ఆసక్తికరంగా మాట్లాడారామె. ‘ఒకప్పుడు సోషల్మీడియాలో చురుగ్గా ఉండేదాన్ని. కానీ నా ఫొటోలు మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన కామెంట్లు పెట్టి కొందరు నన్ను బాధపెట్టారు. వాళ్ల వల్ల అంతా నన్ను ద్వేషిస్తున్నట్టు అనిపించేది. ఇప్పుడు సోషల్మీడియాకు దూరంగా, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నా. వందకోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియా జోలికి మాత్రం పోను’ అంటూ తెగేసి చెప్పింది ఐశ్వర్య లక్ష్మి.
తన తాజా సినిమా ‘గట్టాకుస్తీ 2’ గురించి మాట్లాడుతూ “గట్టాకుస్తీ 2’ మంచి విజయం సాధించిందని అంతా అంటుంటే ఆనందంగా ఉంది. స్త్రీ,పురుష సమానత్వాన్ని ప్రతిబింబించే సినిమా అది. అందుకే అది నా మనసుకు దగ్గరైన సినిమా.’ అంటూ ఐశ్వర్యలక్ష్మి ఆనందం వెలిబుచ్చింది. ప్రస్తుతం ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నది ఐశ్వర్యలక్ష్మి. ‘తీవియన్ పొట్రు’, ‘లవ్’ అనే వెబ్ సిరీస్లు కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా ఈ అందాలభామ పలకరించనున్నదని టాక్.