న్యూఢిల్లీ, అక్టోబర్ 29: పాకిస్థాన్లోని ఇంజినీరింగ్, టెక్నాలజీ కాలేజీల్లో చేరాలనుకొనే భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్(ఓసీఐ) ముందుగా తప్పనిసరిగా తమ దగ్గర నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్వోసీ) తీసుకోవాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) తెలిపింది. తాము రూపొందించిన ఫార్మాట్లో విద్యార్థులు ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశీ వర్సిటీల్లో చదవాలనుకొనే విద్యార్థులు ఆ డిగ్రీలు ఇండియాలో ఉద్యోగాలకు చెల్లుతాయా.. లేదా.. అన్నది తెలుసుకొని అక్కడి కోర్సుల్లో చేరాలని సూచించింది.