వాయిదా పడిన ఆఫ్ఘన్ శాంతి సమావేశం
అమెరికా మద్దతు ఉన్న ఆఫ్ఘన్ శాంతి సమావేశం వాయిదా పడింది. ఇస్తాంబుల్ నగరంలో నిర్వహించే ఈ సమావేశం వాయిదా పడినట్లు టర్కీ ప్రకటించింది

కాబూల్ : అమెరికా మద్దతు ఉన్న ఆఫ్ఘన్ శాంతి సమావేశం వాయిదా పడింది. ఇస్తాంబుల్ నగరంలో నిర్వహించే ఈ సమావేశం వాయిదా పడినట్లు టర్కీ ప్రకటించింది. ఈ సమావేశం శనివారం ప్రారంభం కావాల్సి ఉన్నది. తదుపరి సమావేశాన్ని రంజాన్ నెల చివరకు వాయిదా వేసినట్లు సమాచారం.
ఖతార్, యూఎస్, ఐక్యరాజ్యసమితితో మాట్లాడటం ద్వారా ప్రస్తుతానికి ఈ చర్చలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం టర్కీ విదేశాంగ కార్యదర్శి మావ్లుట్ కవుసోగ్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితి, ఖతార్‌లతో సంయుక్తంగా జరగనున్న ఈ చర్చలు ఏప్రిల్ 24 నుంచి మే 4 వరకు జరుగుతాయని టర్కీ గతంలో నివేదించింది. దీనిపై ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి ఎటువంటి ప్రకటన చేయలేదు.
అదే సమయంలో, తాలిబాన్ ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ ఒక సందేశం పంపారు. తమకు దీని గురించి ఎటువంటి సమాచారం లేదని, ఈ సమావేశానికి రంజాన్ తరువాత ఏ తేదీ గురించి కూడా చెప్పలేమని ఆ సందేశంలో తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన బలగాలను పూర్తిగా తొలగించిన తర్వాతనే శాంతి సమావేశానికి హాజరవుతామని గతంలోనే తాలిబాన్లు ప్రకటించారు, అయితే, సెప్టెంబర్ 11 వ తేదీ వరకు తమ బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటామని ఆమెరికా మరోవైపు స్పష్టం చేసింది.
ఇక్కడ, గత ఏడాది కుదిరిన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని తాలిబాన్ ఆరోపిస్తున్నది. గత ఏడాది ఫిబ్రవరిలో తాలిబాన్లు, అప్పటి ట్రంప్ ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది మే 1 నాటికి అమెరికా దళాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇలాఉండగా, శాంతి చర్చలు వాయిదా వేయడానికి కొన్ని గంటల ముందు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో నలుగురు గాయపడ్డారు. భద్రతా దళాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
ఇవి కూడా చదవండి..
పాట్నా ఎయిమ్స్‌లో కరోనా కలకలం.. 384 మంది సిబ్బందికి పాజిటివ్
ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
బ్రిటన్‌లో తగ్గిన కొవిడ్ మరణాలు..
తూత్తుకుడిలో 1500 కోట్ల కొకైన్ పట్టివేత
అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల అహరణ
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
రాజస్థాన్ జైలు నుంచి ఖైదీలు పరారీ
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

