హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఫ్లోరిడా అంట్లాటా యూనివర్సిటీలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ ఫ్యాకల్టీ డాక్టర్ హరి కాల్వ వెల్లడించారు. ఆగస్టు సీజన్ ప్రవేశాల కోసం జూన్ 2లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. 2023 జనవరి సీజన్‌కు నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. యూజీ కోర్సుల ఫీజు 13.4 లక్షలు, ఎంఎస్ కోర్సుల ఫీజు 14.3 లక్షలు ఉంటుందని చెప్పారు. ప్రతిభను బట్టి 18.6 లక్షల వరకు స్కాలర్షిప్స్ లభిస్తాయని అన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి 2021లో 30 మంది మాత్రమే ప్రవేశాలు పొందగా, 2022లో 500 మంది అడ్మిషన్ పొందారని తెలిపారు. సమావేశంలో స్టడీ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ కరణ్ లలిత్ తదితరులు పాల్గొన్నారు.