Dacoit Movie | టాలీవుడ్ నటుడు అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). ఒక ప్రేమ కథ అనేది ఉపశీర్షిక. ఈ ప్రాజెక్ట్ ద్వారా షానీల్ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం సినిమా టీజర్‌ను విడుదల చేసింది. నాగార్జున సినిమాలోని ఐకానిక్ సాంగ్ ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ బ్యాక్‌గ్రౌండ్ పాటతో ఈ టీజర్ మొదలవ్వగా.. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ టీజర్ సాగింది. ఇందులో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ దొంగలుగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా.. మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.