Dacoit Teaser | ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’.. అదిరిపోయిన అడివి శేష్ ‘డెకాయిట్’ టీజర్
Dacoit Movie | టాలీవుడ్ నటుడు అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ (Dacoit).
Dacoit Movie | టాలీవుడ్ నటుడు అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). ఒక ప్రేమ కథ అనేది ఉపశీర్షిక. ఈ ప్రాజెక్ట్ ద్వారా షానీల్ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం సినిమా టీజర్‌ను విడుదల చేసింది. నాగార్జున సినిమాలోని ఐకానిక్ సాంగ్ ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ బ్యాక్‌గ్రౌండ్ పాటతో ఈ టీజర్ మొదలవ్వగా.. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ టీజర్ సాగింది. ఇందులో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ దొంగలుగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా.. మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

