చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరి 4న ప్రేక్షకులముందుకురానుంది. మణిశర్మ స్వరాల్ని అందిస్తున్న ఈ చిత్రంలోని రెండో గీతం ‘నీలాంబరి..’ని ఈ నెల 5న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రేయసీప్రియుల మధ్యనున్న అపురూప బంధాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగుతుందని, రామ్‌చరణ్-పూజాహెగ్డే జంట మధ్య ప్రణయం ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది.
ఈ సినిమాలో చిరంజీవి ఆచార్యుడిగా, నక్సలైట్‌గా రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆచార్యకు తోడుగా నిలిచే సిద్ధ అనే శక్తివంతమైన పాత్రను రామ్‌చరణ్ పోషిస్తున్నారు. ఆయన సరసన పూజాహెగ్డే నటిస్తున్నది. ఓ బలమైన సామాజిక అంశాన్ని కమర్షియల్ పంథాలో ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణ్ణావుక్కరసు, సంగీతం: మణిశర్మ, నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, రచన-దర్శకత్వం: కొరటాల శివ.