హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : సర్కార్ స్కూళ్ల ఎత్తివేతను నిరసిస్తూ ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు ఇచ్చింది. ఈ బంద్‌ను సక్సెస్ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్ రాంబాబు పిలుపు ఇచ్చారు.
23వేల స్కూళ్లను మూసివేస్తామన్న ప్రకటనను సీఎం రేవంత్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రైవేట్ స్కూళ్లల్లో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫీజు రెగ్యులేషన్ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులు నియంత్రించాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకాని శివప్రసాద్ కోరారు. శుక్రవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర విద్యాసామగ్రి పేరిట అదనపు భారం మోపకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.