షాకింగ్: సోషల్ మీడియాకు దూరంగా అమీర్ ఖాన్
సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వారి మూవీ అప్డేట్స్తో పాటు పర్సనల్ విషయాలను కూడా ఇందులో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే అందరు సోషల్ మీడియా వైపు అడుగులు వేస్తున్న సమయంలో అమీర్ ఖాన్ తన బర్త్ రోజు తాను ఇప్పటి నుండి సామాజిక మాద్యమాలకు దూరంగ ఉంటానని చెప్పి షాక్ ఇచ్చాడు. సినిమాలకు సంబంధించిన ప్రకటనలను సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఏకేపీ) అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించి కాస్త ఉపశమనం కలిగించారు.
సోమవారం అమీర్ ఖాన్ తన 56వ బర్త్‌డే జరుపుకోగా, ఆయనకు పలువురు ప్రముఖలు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన అమీర్.. ఇదే నా చివరి సందేశం అంటూ ఓ పోస్ట్ పెట్టారు. హాయ్, అందరికి నమస్కారం. నాపై మీరు చూపించే ప్రేమకు కృతజ్ఞతలు. మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది. ఇదే నా చివరి పోస్ట్. సోషల్ మీడియా నుంచి బయటికి వచ్చినా కూడా మీతో మాత్రం ఎప్పటిలాగే కలుస్తూ ఉంటాను. నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని మీరు ఏకేపీ(ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్) అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పొందొచ్చు అని అమీర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అమీర్ నిర్ణయాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమే అయినప్పటికీ, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తాం అంటున్నారు ఫ్యాన్స్