Covishield Side Effects | కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళన.. పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Covishield Side Effects | కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కోవిషీల్డ్ టీకా వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌పై దర్యాప్తు కోసం నిపుణుల బృందం ఏర్పాటు, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలనే డిమాండ్లతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై (Covishield Side Effects) సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బ్రిటీష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ను సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దేశంలో కోవిషీల్డ్ పేరుతో తయారు చేసి విక్రయించింది.
కాగా, గత నెలలో ఆస్ట్రాజెనెకా సంచలన విషయం బయటపెట్టింది. తమ టీకా తీసుకున్న వారిలో అరుదైన
సందర్భాల్లో టీటీఎస్ లేదా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ థ్రాంబోసిస్కు కారణమవుతుందని తెలిపింది. ఈ పరిస్థితి రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కు దారితీస్తుందని పేర్కొంది.
మరోవైపు దేశంలో కూడా కోవిషీల్డ్ టీకా వేయించుకున్న పలువురు గుండెపోటుతో మరణించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ టీకా వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌పై దర్యాప్తు కోసం నిపుణుల బృందం ఏర్పాటు, టీకా తీసుకున్న తర్వాత మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలనే డిమాండ్లతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించాలని పిటిషనర్ కోరారు. వ్యాక్సిన్ తీసుకున్న కొందరు వికలాంగులుగా మారారని, వారికి కూడా నష్టపరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం అంగీకరించారు. అయితే పిటిషన్‌పై ముందస్తు విచారణను తోసిపుచ్చారు. విచారణ తేదీ కూడా నిర్ణయించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Agrees
- concern
- Covishield
- Hear Plea
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

