లవర్ బోయ్‌గా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న నితిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చెక్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. మార్చిలో రంగ్‌దే అంటూ థియేటర్స్‌లో సందడి చేశాడు. ఇక మ్యాస్ట్రోగా జూన్ 11న రచ్చ చేయనున్నాడు.
నితిన్ బర్త్‌డే సందర్భంగా అంధాదున్ చిత్ర రీమేక్ టైటిల్ మ్యాస్ట్రోగా పెట్టినట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. మూవీ ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు సాయంత్రం 4.05 ని.లకు మూవీ నుండి మరో సర్ప్రైజ్ ఉంటుందని పోస్టర్ ద్వారా తెలియజేశారు. చిత్రంలో నభా నటేష్ నితిన్‌తో జతకట్టనుండగా, తమన్నా కీలక పాత్ర పోషిస్తుంది. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.