Elephants Attack | తిరుపతిలో ఏనుగుల గుంపు బీభత్సం..80 ఎకరాల్లో పంటలు, మామిడి తోటలు ధ్వంసం
Elephants Attack | తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏనుగుల (Elephants) హల్చల్తో రైతులు కంటిమీద కునుకు లేకుండా బెంబేలెత్తి పోతున్నారు.
తిరుపతి : తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏనుగుల (Elephants) హల్చల్తో రైతులు కంటిమీద కునుకు లేకుండా బెంబేలెత్తి పోతున్నారు. రేణిగుంట( Renigunta) మండలం చైతన్య పురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల గుంపు సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల బీభత్సంతో దాదాపు 80 ఎకరాల్లో పంటలు, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి.
ఏనుగుల బీభత్సంపై అటవీ శాఖ అధికారులకు( Forest Officials) ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ఏనుగుల బారి నుంచి మామిడి చెట్లను రక్షించు కోవడానికి బాణాసంచాను పేల్చి ఏనుగులను తరిమే ప్రయత్నం చేస్తున్న ఫలితం లేదని రైతులు వాపోయారు. ఏనుగుల వల్ల
పూర్తిగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారం (Compensation) అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

