Railway Jobs | రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా పారామెడికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 560 పోస్టులను నింపనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 15న ప్రారంభం కానున్నది. అక్టోబర్ 14న ముగియనున్నది. అర్హులు, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టుల వివరాలు
డయాలసిస్ టెక్నీషియన్- లెవల్ 6
ఈసీజీ టెక్నీషియన్- లెవల్ 4
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-II- లెవల్ 3
నర్సింగ్ సూపరింటెండెంట్- లెవల్ 7
ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్)- లెవల్ 5
రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్- లెవల్ 5
హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-II- లెవల్ 6
ఆప్టోమెట్రిస్ట్- లెవల్ 4
ఆడియోలాజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్- లెవల్ 6
పై విభాగాల్లో (Categories) ఈ 560 ఖాళీలను ఆర్ఆర్బీ భర్తీ చేయనున్నది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఆర్బీ సూచిస్తుంది.

Rrb Posts
అర్హతలు
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీతో పాటు పీజీ డిప్లొమా ఉతీర్ణత సాధించాలి. అలాగే కొన్ని పోస్టులకు సైన్స్ సబ్జెక్టులతో 12వ తరగతితో పాటు డిప్లొమా చేసి ఉండాలి. వయసు పోస్టులను బట్టి 18 నుంచి 40 ఏండ్లలోపు ఉండాలి.
దరఖాస్తు
దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యంగాలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు, ఈబీసీలకు రూ. 250.

Online Exam
ఎంపిక
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు. పరీక్ష 100 మార్కులకు (ప్రొఫెషనల్ ఎబిలిటీ 70, జనరల్ అవేర్నెస్ 10, జనరల్ అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10, జనరల్ సైన్స్ 10) ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కు కోత విధిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 21,700 నుంచి 44,900 జీతం ఉంటుంది.
చివరితేదీ
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 14తో ముగుస్తుంది. అర్హులు, ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్సైట్ https://indianrailways.gov.in/లో చూడండి.