PNB Notification | పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 545 లోక్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో తెలంగాణలో 41, ఏపీలో 4 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా అస్సాం 85, పశ్చిమ బెంగాల్ 80, కర్ణాటక 78, గుజాత్, 77, మహారాష్ట్ర 67, తమిళనాడు 51, త్రిపుర 18, జమ్మూ కశ్మీర్ 9, మేఘాలయ 8, మణిపూర్ 6, మిజోరం 5, నాగాలాండ్ 5, సిక్కిం 5, అరుణాచల్‌ప్రదేశ్ 4, లడఖ్ 2 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్లైన్లో ఆగస్టు 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం ఏడాది బ్యాంకింగ్‌లో పని చేసిన అనుభవం అవసరం. సంబంధిత రాష్ట్ర స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటంలో ప్రావీణ్యం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 5 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 3 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 1180 ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 59 ఉంది.
ఎంపిక
పై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హతలున్న అభ్యర్థులకు ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అధిక మార్కులు సాధించినవారిని ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతం నెలకు రూ. 48,480 నుంచి 85,920 ఇస్తారు.
పరీక్ష కేంద్రాలు
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, ఒంగోలు ఉన్నాయి.
దరఖాస్తులు, ఇతర వివరాలకు వెబ్సైట్ http://pnb.bank.in/లో చూడవచ్చు.