హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు, నిరుద్యోగులు శిక్షణ పొందే ఆన్లైన్ కోర్సులపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు సెట్విన్ సంస్థ ఎండీ కే వేణుగోపాలరావు తెలిపారు. ఇందుకు ‘సెట్విన్50’ కోడ్ను ఆన్లైన్లో నమోదుచేయాలని సూచించారు. ఈ అవకాశం డిసెంబర్ 31 వరకు అని పేర్కొన్నారు. సెట్విన్.ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా 25 కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ అందించడానికి ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఎంఎస్ ఆఫీస్, డీటీపీ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సులు, సీ++, పైథాన్, జావా, డాట్నెట్తోపాటు స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్స్కిల్స్తో శిక్షణ అందిస్తున్నట్టు వెల్లడించారు.