చిత్రంలో కనిపిస్తున్నది మైక్రోస్కోపిక్ కెమెరా. ఇసుక రేణువు పరిమాణంలో ఉన్న ఇది సాధారణ కెమెరా కంటే 5 లక్షల రెట్లు నాణ్యమైన ఫొటోలు తీయగలదు. అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ ఈథన్ సెంగ్, ఆయన సహచరులు దీన్ని తయారు చేశారు. వాస్తవానికి ఇది కెమెరా లెన్స్ కాదు. చిత్రంలో గ్లాస్ మధ్యలో గుండ్రంగా కనిపిస్తున్న దగ్గర 16 లక్షల యాంటెన్నాలు ఉన్నాయి. ఇవి కాంతిని గ్రహిస్తాయి. ఆ కాంతిని మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు ఫొటోగా మార్చుతాయి.