మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు : ఢిల్లీ సీఎం
మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు : ఢిల్లీ సీఎం | దేశ రాజధాని ఢిల్లీలో మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇందులో ఎనిమిదింటిని కేంద్రం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కొవిడ్ పరిస్థితిపై విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. గతవారంలో ఉన్న ఆక్సిజన్ సంక్షోభం నుంచి గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపారు. బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను (ఆక్సిజన్) దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. బుధవారం నుంచి దేశ రాజధానికి చేరుకుంటాయని, ఈ మేరకు రవాణా కోసం వైమానిక దళం విమానాలను ఉపయోగించుకునేందుకు కేంద్రాన్ని అనుమతి కోరినట్లు చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని, విజయవంతమవుతాయనే ఆశాభావంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఫ్రాన్స్ నుంచి 21 రెడీ టూ ఆక్సిజన్ ప్లాంట్లను దిగుమతి చేసుకుంటున్నామన్నారు. వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావచ్చని, వాటిని వివిధ హాస్పిటళ్లలో ఏర్పాటు చేస్తామని, తద్వారా హాస్పిటళ్లలో ఆక్సిజన్ సంక్షోభం పరిష్కరించడంలో సహాయపడుతుందన్నారు. ఈ సందర్భంగా సహాయం అందించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. కలిసికట్టుగా పని చేసి కొవిడ్‌పై యుద్ధంలో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. అలాగే మే 10 నాటికి 1200 ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తామని, సహాయం అందించాలని నాలుగైదు రోజులుగా పారిశ్రామికవేత్తలకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
కాస్త తగ్గినయ్.. కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు
ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం
పీపీఈ కిట్‌లో పెళ్లి.. వైరల్ వీడియో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

