వాషింగ్టన్ : ఉత్తర కాలిఫోర్నియాలోని మారుమూల ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారని కొలుసా కౌంటీ షెరీఫ్ విభాగం తెలిపింది. ప్రమాదాన్ని కేఎస్టీవీ స్టేషన్ డిపార్ట్మెంట్ ధ్రువీకరించింది. ఆదివారం ఘటన చోటు చేసుకుందని, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. ది రాబిన్సన్ ఆర్66 అనే హెలికాప్టర్ మధ్యాహ్నం 1.15 ఆ సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన ఉన్న కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలింది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటనను విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు ఉన్నారని సూచిస్తున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు దర్యాప్తు చేస్తున్నది.