E-Rupi : డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు.. నేడు ఈ-రూపీ ఆవిష్కరణ
నేడు ఈ-రూపీ ఆవిష్కరణ | డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో మరో ముందడగుపడనుంది. కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. సోమవారం

న్యూఢిల్లీ : డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో మరో ముందడగుపడనుంది. కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ-రూపీ (E- Rupi) డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నారు. డిజిటల్ లావాదేవీల కోసం ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు, అమెజాన్ పే, పేటీఎంతో పాటు చాలానే ఉన్నాయి. నగదు రహిత లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-రూపీ విధానాన్ని అందుబాటులో తీసుకువస్తున్నది.
ఈ విధానంతో నగదు రహిత లావాదేవీలు మరింత సులభతరంకానున్నాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కేంద్ర ఆర్థిక సేవలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సాయంతో ఈ-రూపీ రూపకల్పన ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. నగదు చెల్లింపులను క్యూ ఆర్ కోడ్, ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్ ద్వారా లబ్దిదారుడి మొబైల్ ఫోన్‌కు పంపిస్తారు. ఈ వోచర్, క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైనచోట వినియోగించుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల్ని మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ-రూపీని తీసుకువస్తున్నది.
నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఈ కొత్త విధానం తొలిదశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సహాయం అందనుంది. మొబైల్ ఫోన్‌కు క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ వోచర్ రూపంలో నగదు చేరుతుంది. అయితే వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకేనా? అందరికీ అందుబాటులో ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Health Tips: షుగర్ పేషెంట్లు కార్న్ ఫ్లేక్స్ తినొద్దట.. ఎందుకో తెలుసా..?
Ashwagandha Medicine : అశ్వగంధ ఔషధంపై బ్రిటన్ పరిశోధన
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
Anantapur : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

