Anantapur : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి |

అమరావతి : ఏపీలోని అనంతపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గుత్తి జాతీయ రహదారిపై జీపు, లారీ ఢీకొట్టుకొన్నాయి. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గుల్బర్గాకు చెందిన వారిగా గుర్తించారు. జీపులో అనంతపూర్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా రాంగ్ రూట్లో వచ్చిన లారీ కారును ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జవగా.. లారీ రోడ్డుపై బోల్తాపడింది. జీపులోనే మృతదేహాలు చిక్కుపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను అష్రఫ్ అలీ (68), లాయక్ అలీ (45)గా గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
Health Tips: షుగర్ పేషెంట్లు కార్న్ ఫ్లేక్స్ తినొద్దట.. ఎందుకో తెలుసా..?
Ashwagandha Medicine : అశ్వగంధ ఔషధంపై బ్రిటన్ పరిశోధన
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

