విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు | బెంగాల్లో విస్తారా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌కు 15 నిమిషాల ముందు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

కోల్‌కతా : బెంగాల్లో విస్తారా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌కు 15 నిమిషాల ముందు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలవగా.. దవాఖానాలకు తరలించారు. సోమవారం బోయింగ్ 737 విమానం ముంబై నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, చివరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికులను విమానాశ్రయంలో ప్రథమ చికిత్సలు అందించి తర్వాత ఆసుపత్రికి తరలించినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ వర్గాలు తెలిపాయి. ముగ్గురిలో ఒకరు డిశ్చార్జి అవగా.. ఇద్దరు కోల్‌కతాలోని రెండు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి..
పిల్లలపై టీకా ట్రయల్స్
కమలంలో యూపీ దడ!
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఆలస్యం!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

