శంషాబాద్, అక్టోబర్ 22: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని జీవ శ్రీరామనగరంలో (చినజీయర్ ఆశ్రమం) మూడురోజులపాటు జరుగనున్న 2వ ప్రపంచ కూచిపూడి నృత్య మహోత్సవాలను శుక్రవారం త్రిదండి చినజీయర్ స్వామి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం 92వ జయంతి సందర్భంగా ఈ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కూచిపూడి నృత్య కళాకారులను చినజీయర్ అభినందించారు.