తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పంట..
Swachh Survekshan Awards | స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ఫాస్ట్ మూవింగ్ సిటీల విభాగంలో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలకు ఏడు అవార్డులు వరించాయి. వీటితో కలిపి స్వచ్ఛ సర్వేక్షన్-2022 ర్యాంకింగ్స్‌లో 23 అవార్డులతో పాటు ఇండియా స్వచ్ఛత
హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ఫాస్ట్ మూవింగ్ సిటీల విభాగంలో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలకు అవార్డులు వరించాయి. వీటితో కలిపి స్వచ్ఛ సర్వేక్షన్-2022 ర్యాంకింగ్స్‌లో 23 అవార్డులతో పాటు ఇండియా స్వచ్ఛత లీగ్ కింద మరో మూడు అవార్డులను తెలంగాణ కైవసం చేసుకున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో మూడు నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న ఫాస్ట్ మూవింగ్ మీడియం సిటీల జాబితాలో వరంగల్ అర్బన్ మూడో స్థానంలో నిలిచింది.
50వేల నుంచి లక్ష జనాభా మధ్య ఉన్న ఫాస్ట్ మూవింగ్ సిటీల్లో కాగజ్‌నగర్ రెండోస్థానంలో, జనగామ మూడో స్థానం కైవసం చేసుకున్నది. 25వేల-50 వేల మధ్య జనాభా కలిగిన ఫాస్ట్ మూవింగ్ సిటీలలో రంగారెడ్డిలోని ఆమనగల్ రెండో స్థానంలో ఉంది. ఇక 15 వేల నుంచి 25 వేల మధ్య జనాభా కలిగిన ఫాస్ట్ మూవింగ్ సిటీలలో మేడ్చల్-మాల్కాజ్‌గిరి పరిధిలోని గుండ్లపోచంపల్లి రెండో స్థానంలో ఉండగా.. వనపర్తి పరిధిలోని కొత్తకోట మూడో స్థానంలో నిలిచింది.
15వేల కంటే తక్కువ జనాభా కలిగిన ఫాస్ట్ మూవింగ్ సిటీల జాబితాలో వరంగల్ జిల్లాలోని వర్ధనపేట రెండోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 మధ్య నిర్వహించింది. పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, అవగాహనపై సర్వే సాగింది. దేశవ్యాప్తంగా 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే చేపట్టింది. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటి లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదోడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రజల అవగాహన, సిటిజన్ ఎంగెజ్మెంట్, ఇన్నోవేషన్స్‌పై సర్వే జరిపారు. ఇదిలా ఉండగా.. తెలంగాణకు 26 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అటు పల్లెలు ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు చేసేందుకు అమలుచేస్తున్న పరిపాలనా సంస్కరణలు, అనేక అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డులు దక్కుతున్నాయన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణతోపాటు అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
అవార్డుకు ఎంపికైన పట్టణాలు..
1. ఆదిభట్ల మున్సిపాలిటీ
2. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్
3. భూత్పూర్ మున్సిపాలిటీ
4. చండూర్ మున్సిపాలిటీ
5. చిట్యాల మున్సిపాలిటీ
6. గజ్వేల్ మున్సిపాలిటీ
7. ఘట్కేసర్ మున్సిపాలిటీ
8. హుస్నాబాద్ మున్సిపాలిటీ
9. కొంపల్లి మున్సిపాలిటీ
10. కోరుట్ల మున్సిపాలిటీ
11. కొత్తపల్లి మున్సిపాలిటీ
12. నేరుడుచర్ల మున్సిపాలిటీ
13. సికింద్రాబాద్ కంటోన్మెంట్
14. సిరిసిల్ల మున్సిపాలిటీ
15. తుర్కయాంజల్ మున్సిపాలిటీ
16. వేములవాడ మున్సిపాలిటీ
20. వరంగల్ కార్పొరేషన్
21. వర్థన్నపేట మున్సిపాలిటీ
22. జనగామ మున్సిపాలిటీ
23. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ
24. కొత్తకోట మున్సిపాలిటీ
25. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ
26. అమన్‌గల్ మున్సిపాలిటీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

