ఇండియన్ స్క్రీన్‌పై మొట్టమొదటిసారి సింగిల్‌షాట్ విధానంలో ఏక పాత్రతో రూపొందుతున్న చిత్రం ‘105 మినిట్స్’. హన్సిక కథానాయికగా నటిస్తున్నది. రాజు దుస్సా దర్శకుడు. బొమ్మక్ శివ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రయోగాత్మకంగా సాగే ఈ చిత్రంలో హన్సిక పాత్రచిత్రణ కొత్తగా ఉంటుంది. రీల్ టైమ్, రియల్ టైమ్ ఒకటే ఉంటుంది. ఓ భవంతిలో యువతికి ఎదురైన పరిణామాలేమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. కీలక సన్నివేశాల్లో వచ్చే గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కిషోర్ బోయిదాపు, సంగీతం: సామ్ సి.ఎస్.