హైదరాబాద్, ఏప్రిల్ 25: అంతర్జాతీయ డిజిటల్ స్పోర్ట్ ప్లాట్ఫామ్ సేవల సంస్థ ఫానాటిక్స్..ఈ ఏడాది ముగిసేనాటికి మరో 100 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 2018లో కేవలం ఒకే ఒక ఉద్యోగితో హైదరాబాద్లో డిజిటల్ సేవలు ఆరంభించిన సంస్థ..ప్రస్తుతం ఈ సెంటర్లో 170 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యని 250కి పెంచుకోనున్నట్లు ప్రకటించింది. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, ఆన్లైన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నట్లు తెలిపింది.