హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా చార్జీలను ( Auto-Rickshaw Fares ) సవరించింది. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటో రంగాన్ని కూడా కీలక భాగస్వామిగా గుర్తిస్తూ ప్రభుత్వం 12 సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhaker ) తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్, మీ టికెట్ ( ‘MeeTicket) యాప్ ప్రారంభం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆటో రిక్షా చార్జీలను సవరించినట్లు వెల్లడించారు.
సవరించిన ఆటో చార్జీలు:
మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస చార్జీ: రూ.30
ప్రతి తదుపరి కిలోమీటర్‌కు రూ.14
నిరీక్షణ చార్జీ నిమిషానికి రూ.0.75 పైసలు
అర్హత కలిగిన సామాను ప్యాకేజీ చార్జీ రూ.0.50 పైసలు
గరిష్ఠ సామాను పరిమితి 100 కిలోలు
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీకి 1.5 రెట్లను సవరిస్తూ జీవోను జారీ చేసినట్లు వెల్లడించారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధి, పెరిగిన నిర్వహణ వ్యయాలు, ప్రయాణికుల ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ ఈ చార్జీల సవరణ చేపట్టినట్లు తెలిపారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు.