హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తిరుమలలోని శ్రీవారిని దర్శించుకొనేందుకు నవంబర్ 1 నుంచి టైమ్‌స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీచేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతిలో టీటీడీ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్టాండ్‌ను సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. టైమ్‌స్లాట్ సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని వివరించారు. ఉదయం 8.30 గంటల నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలోని టీటీడీ ఉద్యోగులకు ఈ-బైక్‌లు అందజేస్తామని చెప్పారు.