రేపటి నుంచి రూ.10 తగ్గనున్న వంట గ్యాస్
న్యూఢిల్లీ : వంట గ్యాస్ సిలిండర్ ధర రేపటి నుంచి తగ్గనున్నది. ఏప్రిల్ 1 నుంచి సిలిండర్‌పై రూ.10 తగ్గుతుంది.

న్యూఢిల్లీ : వంట గ్యాస్ సిలిండర్ ధర రేపటి నుంచి తగ్గనున్నది. ఏప్రిల్ 1 నుంచి సిలిండర్‌పై రూ.10 తగ్గుతుంది. ఫిబ్రవరిలో వరుసగా ధరల పెరుగుదల ప్రభావంతో ఉన్న గృహిణులకు ఉపశమనం కలిగించేలా గ్యాస్ ధర తగ్గింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం సిలిండర్ ధరలో రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటికే వారంలో మూడుసార్లు తగ్గించినప్పటికీ, వంట గ్యాస్ ధర కూడా సమీప భవిష్యత్తులో తగ్గుతాయని అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ చమురు ధరలు పడిపోయినందున పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలన్నీ తగ్గుతాయని పేరు తెలుపడానికి ఇష్టపడని ఒక ఉన్నత అధికారి తెలిపారు. మంగళవారం ధరలను కొంత పెంచినప్పటికీ, మొత్తం ధోరణి క్షీణించిందని, ఇది దేశీయ రిటైల్ రేట్లలో ప్రతిబింబించాలని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్‌కు ఈ ఏడాది ప్రారంభం నుంచి మూడుసార్లు పెంపుదల తర్వాత ధర రూ.819 కు చేరుకున్నది. జనవరిలో ధర రూ.694 గా ఉండగా.. ఫిబ్రవరిలో రూ.719 కు పెరిగింది. ఫిబ్రవరి 15 న ధరను మళ్లీ రూ.769 కు, ఫిబ్రవరి 25 న మళ్లీ రూ.794 కు పెంచారు. మార్చిలో ఈ ధర రూ.819 కు చేరుకున్నది.
కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.845 కాగా, ముంబై, చెన్నైలలో ధరలు వరుసగా రూ.819, రూ.835 గా ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth vs Raja Gopal Reddy | రేవంత్ మెంటల్ స్టేటస్ బాలేదు.. సీఎంపై రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు
Revanth Reddy | సిద్దిపేటలో సీఎం అబద్ధాల వరద.. అసలు నిజాలు ఏమిటో చర్చించుకుంటున్న జనం
Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ ఔట్.. కమీషన్ల ఆరోపణల నేపథ్యంలోనే తొలగింపు?
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో అమన్‌కు డబుల్ ధమాకా.. కొత్త కెప్టెన్‌గా విజయం,టికెట్ టు ఫినాలేకు నేరుగా ఛాన్స్!
Harish Rao | సిద్దిపేటలో పోటీకి నువ్వు సిద్ధమా.. ప్రజాక్షేత్రంలో నువ్వోనేనో తేల్చుకుందాం.. రేవంత్‌కు హరీశ్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

