రూ.7కోట్ల విలువైన బంగారు ఆభరణాల పట్టివేత
రూ.7కోట్ల విలువైన బంగారు ఆభరణాలు పట్టివేత | గుజరాత్‌లోని సూరత్ నగరం నుంచి ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

భోపాల్: గుజరాత్‌లోని సూరత్ నగరం నుంచి ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7 కోట్లు విలువైన 14 కిలోల బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను మధ్యప్రదేశ్‌లోని కట్ని స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు తప్తి గంగా ఎక్స్‌ప్రెస్ నుంచి ప్రయాణిస్తున్నారు. నిందితులు ప్లాస్టిక్ డబ్బాల్లో బంగారు ఆభరణాలను తరలించగా.. స్టేషన్ ప్రధాన గేటు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సోదా చేయగా.. బంగారు గొలుసులు, ఉంగరాలు, చెవిపోగులతో పాటు ఇతర బంగారు వస్తువులను గుర్తించినట్లు తెలిపారు. ఆభరణాలు 14 కిలోల వరకు ఉంటాయని, మార్కెట్ విలువ రూ.7కోట్ల వరకు ఉంటుందని జీఆర్పీ స్టేషన్ ఇన్చార్జి ఆర్కే పటేల్ పేర్కొన్నారు. ముగ్గురూ గుజరాత్‌లోని సూరత్ నుంచి వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. అనంతరం రైల్వే పోలీస్ అధికారులు ఆదాయపు పన్నును, బిల్లులను పరిశీలించి.. జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
నేడు కేంద్ర కేబినెట్ భేటీ!
కరోనా టీకా డ్రైవ్‌లో మరో మైలురాయి దాటిన భారత్
మిక్సింగ్ టీకాలు తీసుకున్న ఇటలీ ప్రధాని
డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం
12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య
నేడు 86వేల మంది అన్నదాతల ఖాతాల్లోకి ‘రైతుబంధు’
దేశంలో 3కోట్లు దాటిన కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

