అర్థమెటిక్తో పాటు సమయపాలన కలిగిన రీజనింగ్ ఎబిలిటీ కోసం ఎలా సన్నద్ధం కావాలి? ఇందులో ముఖ్యమైన అంశాలు వంటి హైలెవల్ టాపిక్స్, మార్కుల కేటాయింపు వాటి గురించి తెలుసుకుందాం.
మంచి మార్కుల కోసం
ముందుగా దరఖాస్తు చేసుకొన్న పరీక్షను బట్టి సిలబస్‌ను, పరీక్ష విధానాన్ని తెలుసుకోవాలి. IBPS, SBI, RBI, NABARD, MANIPAL ఎగ్జామ్స్‌లో రీజనింగ్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి.
ఏయే అంశాలు అధ్యయనం చేయాలి
ప్రిలిమ్స్, మెయిన్స్ 60 శాతం ప్రశ్నలు, రిపీటెడ్ చాప్టర్స్ నుంచి వస్తాయి. కాబట్టి వీటిని ఉమ్మడిగా చదవాలి. ప్రతి చాప్టర్లో ఎన్ని మోడల్స్ ఉంటాయో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వాటిని పూర్తిగా చదవాలి.
బ్యాంకు పరీక్షలకు తార్కిక (లాజికల్) రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ టాపిక్స్ చాలా కీలకం. వీటికి ఇంగ్లిష్‌లో నైపుణ్యత కూడా అవసరం. ఇందులో స్టేట్మెంట్ ఆధారిత, పజిల్స్‌లో లాంగ్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఫాస్ట్రీడింగ్ అనాలిసిస్ కోసం ఇంగ్లిష్ బాగా ఉపయోగపడుతుంది.
బ్యాంకు రీజనింగ్ సాల్వింగ్‌కు టైం మేనేజ్మెంట్ చాలా కీలకం. అందుకు కారణం ఈ సెక్షన్లో రీడింగ్ కంటెంట్ ఆధారిత ప్రశ్నలు అధికంగా ఉండటమే. కాబట్టి సమయ పాలనపై దృష్టిసారించి ప్రాక్టీస్ చేయాలి.
గత ప్రశ్నపత్రాలు తిరగేయడం, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రశ్నల స్థాయిని అంచనా వేయవచ్చు.
ఇందులో నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్, కౌంటింగ్ ఫిగర్స్ వంటి అంశాలు స్కోర్స్, క్యూబ్స్ వంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి.
ప్రత్యేకమైన ప్రణాళిక, నిరంతర శ్రమ, అవగాహన సామర్థ్యాలు అలవర్చుకోవాలి.
100 శాతం అక్యురసీ కోరే సబ్జెక్టుల్లో అర్థమెటిక్ తర్వాత రీజనింగ్ అని గుర్తించాలి. మిగతా సబ్జెక్టులకు అవగాహనతో గెస్సింగ్ ద్వారా కూడా సమాధానాలను పసిగట్టవచ్చు. కానీ అర్థమెటిక్, రీజనింగ్‌లకు కచ్చితత్వం చాలా అవసరం. అప్పుడే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
దృఢ సంకల్పం, మంచి ప్రణాళిక, కఠినమైన సాధన, నిరంతరం మోడల్ పేపర్స్ ప్రాక్టీసింగ్ వంటివి అవలంబిస్తే బ్యాంకు జాబ్ సొంతం చేసుకోవచ్చు.
ఇతర పోటీ పరీక్షలకు రీజనింగ్ టాపిక్స్ రీజనింగ్‌లో 3 భాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
లాజికల్ రీజనింగ్
నంబర్ సిరీస్
లాజికల్ డిడక్షన్స్
లాజికల్ ప్రాబ్లమ్స్
స్టేట్మెంట్ అండ్
ఆర్గ్యుమెంట్స్
స్టేట్మెంట్ అండ్ అసంప్షన్స్
కోర్స్ ఆఫ్ యాక్షన్స్
స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్
కాడ్ అండ్ ఎఫెక్ట్
వెర్బల్ రీజనింగ్
వెర్బల్ రీజనింగ్
లెటర్ సిరీస్
అనాలజీ
డైస్- పాచికలు
రక్త సంబంధాలు
దిశాత్మక పరీక్షలు
పదాల నిర్మాణం
ర్యాంకింగ్ టెస్ట్
పజిల్స్
సీటింగ్-అరెంజ్మెంట్స్
సిలాజిసమ్స్
నాన్ వెర్బల్ రీజనింగ్
వెన్ చిత్రాలు
చిహ్నాలు
ఫిగర్ మ్యాట్రిక్స్
మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్
పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్
రిఫరెన్స్ బుక్స్
లాజికల్ రీజనింగ్ ; ఆర్ఎస్ అగర్వాల్
రీజనింగ్ గైడ్ :ఆర్ గుప్తా
అనలిటికల్ రీజనింగ్ : ఎంకే పాండే
వెర్బల్/నాన్ వెర్బల్ : బీఎస్ సిజ్వాలి
రీజనింగ్ టెస్ట్ పేపర్స్ : ప్రేమ్‌కృష్ణ
అర్థమెటిక్, రీజనింగ్లే కీలక విభాగాలు. ప్రాక్టీసింగ్, స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్, స్మార్ట్ వర్క్ ద్వారా ఇందులో మంచి మార్కులు సాధించవచ్చు. వీటిలో అతిముఖ్యమైన అంశాలను గుర్తించాలి. అంటే 4-5 ప్రశ్నలు వచ్చే అంశాలు, 10-15 మార్కులు పొందగలిగే అంశాలు గుర్తించగలగాలి. ఇది కేవలం కఠినమైన సాధన ద్వారా మాత్రమే వీలవుతుంది. నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి.
మెయిన్స్
ఇందులో సాధించిన మార్కులు తుది జాబితాకు పరిగణనలోకి తీసుకొంటారు. ఇందులో రీజనింగ్ నుంచి హెచ్చుస్థాయి ప్రశ్నలు వస్తాయి.
ఆలోచన, శక్తి సామర్థ్యాలను పదును పెట్టే అంశాలు
పజిల్స్ సీటింగ్ అరెంజ్మెంట్స్: 10-15 ప్రశ్నలు
సిలాజిసమ్స్: 4-5 ప్రశ్నలు
ఇన్పుట్-అవుట్‌పుట్: 3-4 ప్రశ్నలు
స్టేట్మెంట్-ఆర్గ్యుమెంట్స్, అసంప్షన్స్, కంక్లూజన్స్ : 4-5 ప్రశ్నలు
రక్త సంబంధాలు: 2-3 ప్రశ్నలు
గడియారాలు :1-2 ప్రశ్నలు
కోడింగ్-డి కోడింగ్: 1-2 ప్రశ్నలు
అనాలజీ :1-2 ప్రశ్నలు
ర్యాంకింగ్ పరీక్షలు :1-2 ప్రశ్నలు
అనాలజీ, పోలిక, భిన్న పరీక్షలు: 2-4 ప్రశ్నలు
మెయిన్స్‌లో రీడింగ్ కంటెంట్ వంటి స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలే అధికం. దీనివల్ల సమయ పాలనపై అవగాహన ఏర్పరచుకొని చదవడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. మెయిన్స్‌లో రీజనింగ్‌తో పాటు కంప్యూటర్స్ విభాగం కూడా కలిపి ప్రశ్నలు అడుగుతారు. ముందుగా రీజనింగ్ టాపిక్స్ పూర్తి చేసిన తర్వాత కంప్యూటర్స్ సెక్షన్ చేయడం వల్ల సమయాన్ని ఆదా చేసినవారవుతారు.
ప్రిలిమ్స్
లెటర్ సిరీస్ :1-2 ప్రశ్నలు
అనాలజీ :1-2 ప్రశ్నలు
వర్గాల విభజన (Add one out) : 1-2 ప్రశ్నలు
రక్త సంబంధాలు :2-3 ప్రశ్నలు
దిశాత్మక పరీక్ష :1-2 ప్రశ్నలు
ర్యాంకింగ్ టెస్ట్ :2-3 ప్రశ్నలు
కోడింగ్-డి కోడింగ్: 1-2 ప్రశ్నలు
పద నిర్మాణం :1-2 ప్రశ్నలు
సిలాజిసమ్స్ :3-4 ప్రశ్నలు
పజిల్స్-సీటింగ్ అరెంజ్మెంట్స్ :10-12 ప్రశ్నలు
తీర్మానాలు :3-4 ప్రశ్నలు
రీజనింగ్‌లో మార్కుల కేటాయింపు
ప్రిలిమ్స్ :35 ప్రశ్నలు- 35 మార్కులు
మెయిన్స్ :35-45 ప్రశ్నలు (కంప్యూటర్స్‌తో కలిపి)
గ్రామీణ బ్యాంకులో ప్రిలిమ్స్ :40 ప్రశ్నలు- 40 మార్కులు
మెయిన్స్ :45 ప్రశ్నలు
ఎస్. మధుకిరణ్
డైరెక్టర్, ఫోకస్ అకాడమీ, హైదరాబాద్