‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. అఖిల్ గట్టిగానే కొట్టాడబ్బా..
‘Most Eligible Bachelor’ First Weekend Collections | అనుకున్నదే జరిగింది. మూడో రోజు కూడా అఖిల్ అక్కినేని సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా రోజుల తర్వాత

అనుకున్నదే జరిగింది. మూడో రోజు కూడా అఖిల్ అక్కినేని సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా రోజుల తర్వాత థియేటర్స్ వైపు వస్తున్నారు. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కలెక్షన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే 90శాతం రిటర్న్స్ తీసుకొచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది.
దాంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో వాసు వర్మ, బన్నీ వాస్ సంయుక్తంగా సినిమాను నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాతో మొదటి హిట్ కొట్టేస్తున్నాడు అఖిల్. ఆరేళ్లుగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అన్ని చోట్లా కుమ్మేస్తుంది. మూడో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ.5కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. బొమ్మరిల్లు తర్వాత ఆ స్థాయి విజయం లేని భాస్కర్ ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు కనిపించినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం కాసుల వర్షం బాగానే కురిసింది. ఈ సినిమా 3రోజుల ఏరియా వైజ్ వసూళ్లు చూద్దాం..
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
నైజాం: 5.41 కోట్లు
సీడెడ్: 2.94 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.67 కోట్లు
ఈస్ట్: 0.86 కోట్లు
వెస్ట్: 0.70 కోట్లు
గుంటూరు: 1.03 కోట్లు
కృష్ణా: 0.79 కోట్లు
నెల్లూరు: 0.61 కోట్లు
ఏపీ + తెలంగాణ: 14.01 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.21 కోట్లు
వరల్డ్ వైడ్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 17.23 కోట్లు షేర్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకు రూ. 20.91 కోట్ల బిజినెస్ జరిగింది. 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 17.23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. వీక్ డేస్ కూడా అలాగే కలెక్ట్ చేస్తే నాలుగు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఖాయం. థియేటర్స్ వైపు ఆడియన్స్ బాగానే వస్తుండటంతో కచ్చితంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హిట్ లిస్టులోకి వెళ్లేలా కనిపిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

