ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో 410.62 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ రంగంలోకి 100 శాతం ఎఫ్డీఐలు ఆటోమేటిక్ రూట్లో అనుమతించిన విషయం తెలిసిందే. ఈ రంగంలోకి ఏప్రిల్ 2014 నుంచి సెప్టెంబర్ 2021 మధ్యకాలంలోకి 4.99 బిలియన్ డాలర్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయని పేర్కొంది.