ఢిల్లీ సరిహద్దులో ఇద్దరు రైతుల మృతి.. ఒకరికి కరోనా పాజిటివ్
ఢిల్లీ సరిహద్దులో ఇద్దరు రైతుల మృతి.. ఒకరికి కరోనా పాజిటివ్ |

న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న పంజాబ్‌కు చెందిన ఇద్దరు రైతులు బుధవారం మృతి చెందారు. ఇందులో ఒకరికి కరోనా వైరస్ సోకిందని అధికారులు బుధవారం తెలిపారు. మృతులు బల్బీర్ సింగ్ (50), మహేందర్ సింగ్ (70) పంజాబ్‌లోని పాటియాలా, లుధియానా నివాసులని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుకు సమీపంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల బృందంలో వీరున్నారని పేర్కొన్నారు. బల్బీర్ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు సోనిపట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జస్వంత్ సింగ్ పూనియా తెలిపారు. అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించగా.. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ సోకినట్లు తేలిందని పేర్కొన్నారు.
అయితే, ఆరోగ్యశాఖ అధికారుల నుంచి తమకు నివేదిక అందలేదని రాయ్ స్టేషన్ ఎస్హెచ్ఓ బిజేందర్ సింగ్ తెలిపారు. మహేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని, అతని మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియదని కుండ్లి ఎస్హెచ్ఓ రవికుమార్ పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని గత ఆరు నెలలుగా పంజాబ్, హర్యానా, ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైతులు సింగు, తిక్రీ, ఢిల్లీ సరిహద్దు పాయింట్లలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పలుసార్లు కేంద్రం, రైతు సంఘాలతో చర్చలు జరిగినా.. కొలిక్కి రాలేదు.
ఇవి కూడా చదవండి..
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..?
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
రష్యాలో టీకా పర్యాటకం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

