కంగారూల కల తీరే

- ఆస్ట్రేలియాదే టీ20 ప్రపంచకప్
- ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం
- రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న కివీస్
- వార్నర్, మార్ష్ విజృంభణ
- విలియమ్సన్ పోరాటం వృథా
- అండర్‌డాగ్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన
- ఆస్ట్రేలియా.. అంచనాలకు అందని ఆటతో అద్భుతం చేసింది!
- టాస్ గెలువడంతోనే సగం మ్యాచ్ గెలిచేసిన
కంగారూలు.. మైదానంలో చిరుతల్లా విజృంభించి న్యూజిలాండ్‌కు మరోసారి వేదన మిగిల్చారు.
వన్డే ఫార్మాట్లో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్‌కు.. టీ20ల్లో ఇదే తొలి టైటిల్ కాగా.. మొదటి సారి తుదిపోరుకు అర్హత సాధించిన కివీస్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది!
సహచరుల నుంచి సహకారం లభించని చోట కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటే.. తోటి బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్న సమయంలో హజిల్‌వుడ్ మూడు వికెట్లతో కివీస్ వెన్ను విరిచాడు. ఛేదన పెద్ద కష్టం కాని దుబాయ్ పిచ్‌పై విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ గట్టి పునాదివేస్తే.. దానిపై మిచెల్ మార్ష్ అందమైన సౌధాన్ని నిర్మిస్తూ ఫైనల్ ఫైట్‌ను ఏకపక్షం చేశాడు.
దుబాయ్: రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. అంచనాల్లేకుండా మెగాటోర్నీలో అడుగుపెట్టిన ఆసీస్.. నిలకడైన ఆటతో టైటిల్ ఎగరేసుకుపోయింది. టాస్ గెలువడంతోనే సగం మ్యాచ్ నెగ్గేసిన కంగారూలు.. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమిష్టిగా సత్తాచాటి అదుర్స్ అనిపించుకున్నారు. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. గత రెండు వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో పరాజయం వైపు నిలిచిన న్యూజిలాండ్ ఈసారి కూడా ఫలితాన్ని మార్చలేకపోయింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం చేయగా.. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌కు కళ్లెం వేయడంలో కివీస్ బౌలర్లు విఫలమవడంతో బ్లాక్ క్యాప్స్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సత్తాచాటగా.. మరో ఎండ్ నుంచి సారథికి సరైన సహకారం అందలేదు. మార్టిన్ గప్టిల్ (28), డారిల్ మిచెల్ (11), ఫిలిప్స్ (18), నీషమ్ (13 నాటౌట్), సీఫెర్ట్ (8 నాటౌట్) ధాటిగా ఆడలేకపోయారు. తొలి పది ఓవర్లలో 57 పరుగులే చేసిన న్యూజిలాండ్.. విలియమ్సన్ విజృంభణతో మలి అర్ధభాగంలో 115 పరుగులు పిండుకుంది. 21 పరుగుల వద్ద కేన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బౌండ్రీ సమీపంలో హజిల్‌వుడ్ వదిలేయడంతో కివీస్ భారీ స్కోరు చేయగలిగింది. తొలి 16 బంతుల్లో 15 పరుగులే చేసిన విలియమ్సన్.. ఆ తర్వాత 32 బంతుల్లో 70 పరుగులు రాబట్టడం విశేషం. ఆస్ట్రేలియా బౌలర్లలో హజిల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభం ఇస్తే.. మార్ష్ (50 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకూ నిలిచి జట్టును గెలిపించాడు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. మిచెల్ మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, డేవిడ్ వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
టీ20ల్లో ఆస్ట్రేలియాకిదే తొలి టైటిల్. వన్డే ఫార్మాట్లో ఆసీస్ ఐదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) కప్పు కొట్టింది. పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో (172/4 ) ఇదే అత్యధిక స్కోరు. గతంలో పాకిస్థాన్‌పై భారత్ (2007) చేసిన 157/5 స్కోరు రెండో స్థానానికి చేరింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సంగక్కర (2009) తర్వాత అర్ధశతకం సాధించిన రెండో కెప్టెన్‌గా విలియమ్సన్ రికార్డుల్లోకెక్కాడు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

