నేవీ.. సముద్రమంత అవకాశాలు. నిత్యం చాలెంజింగ్ కెరీర్ కోరుకునే వారికి నేవీ కొలువులు సరిగ్గా సరిపోతాయి. కేవలం ఇంటర్ ఉత్తీర్ణలులైన వారికి ఈ అవకాశం. మంచి జీత భత్యాలు, పదోన్నతులు, ఆకర్షణీయమైన అలవెన్సులతోపాటు దేశసేవ, భద్రమైన కొలువు. వీటన్నింటి సమాహారామే నేవీలో ఏఏ, ఎస్ఎస్ఆర్ కొలువులు. ప్రస్తుతం వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు నిపుణ పాఠకుల కోసం..
భారత ప్రభుత్వ రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎస్) సెయిలర్ పోస్టుల భర్తీకి ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ) – ఫిబ్రవరి -2022 బ్యాచ్‌లో చేరడానికి అర్హత గల అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టులు: సెయిలర్ (ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్)).
మొత్తం ఖాళీలు: 2500 (ఏఏ-500, ఎస్ఎస్ఆర్-2000)
విద్యార్హతలు: ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్టును చదివి ఉండాలి.
వయస్సు: 2002, ఫిబ్రవరి 1 నుంచి 2005 జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి.
పే అండ్ అలవెన్స్‌లు:
శిక్షణా కాలంలో నెలకు రూ.14,600/- ఇస్తారు.
శిక్షణ అనంతరం పేస్కేల్ రూ.21,700-69,100 + ఎంఎస్పీ రూ.5,200/- + ఎక్స్ గ్రూప్ పే రూ.6,200/-+ డీఏ ఇస్తారు.
ఆర్టిఫిసర్ అప్రెంటిస్ పూర్తయిన తర్వాత మాస్టర్ ఛీప్ పెట్టీ ఆఫిసర్ (సుబేదార్ హోదా)లో పే స్కేల్.. రూ.21,700- 1,51,100 + గ్రేడ్ పే రూ.5,200/- + ఎక్స్ గ్రూప్ పే రూ.6,200/ + డీఏ ఇస్తారు.
పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్- 1 (సుబేదార్కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.
శిక్షణాకాలంలో సెయిలర్స్‌కు పుస్తకాలు, యూనిఫాం, భోజనం, వసతి సౌకర్యాలను ఉచితంగా ఇస్తారు. సెయిలర్స్, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తారు. సెయిలర్స్ పిల్లలకు ఉచిత విద్య, హెచ్ఆర్ఏ అలవెన్స్‌లు ఇస్తారు. వీటితోపాటు సంవత్సరాంత సెలవులు ఉంటాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్స్ ద్వారా చేస్తారు.
రాత పరీక్ష విధానం
ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో మాత్రమే ఉంటుంది.
పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్,
జనరల్నాలెడ్జ్పై ప్రశ్నలు ఇస్తారు.
ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది.
పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
ప్రతి సెక్షన్లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ)
7 నిమిషాల్లో 1.6 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి. 20 ఉతక్, బైతక్ (గుంజీలు), 10 పుష్ అప్స్ చేయాలి.
గమనిక: క్రీడల్లో, స్విమ్మింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
శారీరక ప్రమాణాలు
కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. వీటితోపాటు నేవీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మంచి కంటి చూపు (6/12, 6/12 లేదా 6/9, 6/12) ఉండాలి.
శిక్షణ
శిక్షణ ఫిబ్రవరి 2022 నుంచి ప్రారంభమవుతుంది. 9 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్ ఐఎన్ఎస్ చిల్కాలో ఇస్తారు. దీంతోపాటు ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను నేవల్ ట్రెయినింగ్ కేంద్రాల్లో ఇస్తారు. ట్రెయినింగ్ విజయవంతంగా పూర్తిచేసుకొన్న వారికి ఏఏ పోస్టుకు 20 ఏండ్లు, ఎస్ఎస్ఆర్ పోస్టుకు 15 ఏండ్ల కాలపరిమితికి నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 25
వెబ్సైట్: www.joinindiannavy.gov.in
…కేశవపంతుల వేంకటేశ్వరశర్మ