Russia – Ukraine Conflict | ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హిట్లర్, హంతకుడిగా అభివర్ణిస్తున్నారు. ఇకనైనా యుద్ధం ఆపాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో శాంటియాగో, చిలీ, లిథువేనియా వంటి పలు ప్రాంతాల్లో ప్రజలు ఉక్రేనియన్ జెండాతో ప్రదర్శనలు నిర్వహించారు. ఆందోళనకారులు మరికొన్ని చోట్ల ఉక్రెయిన్ జాతీయ గీతం ఆలపించారు. న్యూయార్క్‌లో నిరసనకారులు ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తామని నినదించారు. టైమ్స్క్వేర్తో పాటు రష్యన్ ఫెడరేషన్ మిషన్ వద్ద గుమికూడిన నిరసనకారులు తక్షణం యుద్ధాన్నినిలిపివేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.