లేహ్: యూట్యూబర్లు తమ స్టంట్స్(YouTuber Stunts)తో కటకటాలపాలవుతున్నారు. ఫాలోవర్లను ఆకట్టుకునే క్రమంలో.. చేయకూడని స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ పాపులర్ యూట్యూబర్.. లడాఖ్‌లో విన్యాసాలు చేసి పోలీసుల దృష్టిలో పడ్డాడు. ప్యాన్‌గాంగ్ సరస్సుతో పాటు నుబ్రా ఇసుక తెన్నుల్లో బైక్ స్టంట్స్ చేస్తూ వీడియో పోస్టు చేశారు. ఇది వివాదానికి దారి తీసింది. చాలా సున్నితమైన, నిషేధిత ప్రదేశంలో స్టంట్స్ చేయడంతో ఇరకాటంలో పడ్డాడు.
అలీ అలయ్యాన్ ఇక్బాల్ ఆ స్టంట్స్ చేశాడు. తన విన్యాసాలకు చెందిన ఫోటోలు, వీడియోలను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. లేహ్‌లో స్టంట్స్ చేయడం నిషేధం. ఇక్బాల్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 125, 292 కింద కేసు బుక్ చేశారు. నిషేధిత ప్రదేశాల్లో ప్రమాదకర స్టంట్స్ చేసిన స్వదేశీ టూరిస్టుపై కేసులు నమోదు చేసినట్లు లేహ్ పోలీసులు తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు.
స్థానిక చట్టాలను గౌరవించాలని పర్యాటకులను అధికారులు కోరారు. బైకింగ్, బాడీ బిల్డింగ్ వీడియోలు తీయడంలో ఇక్బాల్ ఫేమస్. సుజీకి హయబూసా, కవాసాకి నింజా సూపర్బైక్లతో అతను లేహ్‌లో తాజాగా స్టంట్స్ చేశాడు. నుబ్రా సాండ్ డ్యూన్స్‌లో కూడా అతను స్టంట్ చేశాడు. తన బైక్‌తో ఇసుకను లేపాడు. మరో క్లిప్‌లో హయబుసా బైక్‌తో ప్యాన్‌గాంగ్ సరస్సులో ఫోటోలు దిగాడు.
యూట్యూబ్‌లో అతనికి 2.74 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 428కే ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల నుబ్రా వ్యాలీలో ఫార్చూనర్తో రైడ్ చేసిన ఓ జంటపై కేసు బుక్ చేశారు.