న్యూఢిల్లీ, నవంబర్ 29: ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండియాలో అప్లోడ్ అయిన 17 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీటిని తొలగించినట్టు గూగుల్‌కు చెందిన యూట్యూబ్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 56 లక్షల వీడియోలను తొలగించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన 73.7 కోట్ల కామెంట్స్‌ను తొలగించినట్టు యూట్యూబ్ పేర్కొంది.