న్యూఢిల్లీ, జూన్ 4: సమాజ్వాదీ పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ తాజా లోక్సభకు ఎన్నికైన పిన్న వయస్కులుగా నిలవనున్నారు! వీరిద్దరి వయసు 25 ఏండ్లు. పుష్పేంద్ర కౌశంబి నియోజక వర్గం నుంచి, ప్రియా సరోజ్ మచ్లీశహర్ నుంచి పోటీ చేశారు. పుష్పేంద్ర ఇప్పటికే విజయం సాధించగా, ప్రియా సరోజ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు డీఎంకే సీనియర్ నాయకుడు టీఆర్ బాలు(82) 3.89 లక్షల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఆయన గెలిస్తే అత్యధిక వయస్సు కలిగిన ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు.