ఆల్ఇండియా ఇమామ్ చీఫ్ ఇలియాసీకి వై ప్లస్ భద్రత
Umer Ahmed Ilyasi | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్‌ను జాతిపితతో పోల్చిన ఆల్ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇలియాసీకి కేంద్ర ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది.
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్‌ను జాతిపితతో పోల్చిన ఆల్ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇలియాసీకి కేంద్ర ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది. బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఇలియాసీకి వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గత నెల 22న ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో ఉన్న మసీదుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఉమర్ అహ్మద్ ఇలియాసీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఇలియాసీ.. మోహన్‌ను జాతిపితతో (రాష్ట్ర పిత) పోల్చారు.
దీంతో ఇంగ్లండ్, దుబాయ్, కోల్‌కతా నుంచి తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకు ఇలియాసీ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన భద్రను కట్టుదిట్టం చేసింది. దీనిపట్ల ఇలియాసీ సంతోషం వ్యక్తంచేశారు. కేంద్ర సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

