బెంగళూరు, సెప్టెంబర్ 6: మాదక ద్రవ్య రహిత మారిషస్‌ను సాధించడం సహా, యువతకు స్వయం సమృద్ధి, సాధికారిత కలిగించే పథకాల గురించి అవగాహన కల్పించేందుకు తాము కృషి చేస్తామని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మారిషస్‌కు చేరుకున్న ఆయనకు ఆ దేశ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపస్, ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌథ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధ్య క్షుడు, ప్రధానితో జరిగిన సమావేశాల్లో ఆయన మారిషస్‌కు ఆయర్వేదాన్ని పరిచయం చేయడం, అక్కడి ఖైదీలపై విస్తృత ప్రభావం చూపిన యోగ శిక్షణ కార్యక్రమాల విస్తరణ వంటి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఖైదీలలో మానసిన పరివర్తన తేవడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన ప్రిజన్ స్మార్ట్ కార్యక్రమాలు కొనసాగించడం కోసం అక్కడి ప్రభుత్వంతో అంగీకార పత్రంపై సంతకాలు చేయనున్నారు.
ముక్కులో వేలు పెట్టుకొంటే మతిమరుపు ముప్పు!
న్యూయార్క్, సెప్టెంబర్ 6: ముక్కులో వేలు పెట్టుకొనే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. లేకపోతే మీకు మతిమరుపు వచ్చే ప్రమాదం ఉన్నదట. ముక్కులో వేలు పెట్టుకొన్నప్పుడు మెదడుకు, ముక్కుకు అనుసంధానమై ఉండే నాళం (నాసల్ ఎపిథీలియం) ద్వారా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మెదడులోకి చేరి మెదడు కణాలను దెబ్బతీస్తాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు.
కాంతి ప్రసరణతో సూపర్ కెపాసిటర్ చార్జింగ్
బెంగళూరు, సెస్టెంబర్ 6: బెంగళూరులోని ఐఐఎస్సీ ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ అప్లయిడ్ ఫిజిక్స్ విభాగం పరిశోధకులు సరికొత్త సూపర్ కెపాసిటర్‌ను అభివృద్ధి చేశారు. దీనిపై కాంతిని ప్రసరింపజేస్తే చాలు.. రీచార్జ్ అవుతుంది. వీధి బల్బులు, వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఈ సూపర్ కెపాసిటర్లను వినియోగించవచ్చునని బెంగళూరులోని ఐఐఎస్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కెపాసిటర్ అనేది విద్యుత్తు శక్తిని నిల్వ చేసే పరికరం. సాధారణ కెపాసిటర్‌తో పోల్చితే ఎన్నో రెట్లు సామర్థ్యం కలిగినదే..‘సూపర్ కెపాసిటర్’. సెల్ ఫోన్లలో పవర్ చిప్స్‌గా కూడా వీటిని వాడొచ్చు.