లక్నో, నవంబర్ 24 : యూపీ ఉప ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఎన్నికల సంఘం నకిలీ ఓటింగ్‌ను నిరోధించేందుకు చర్యలు తీసుకొనే వరకు భవిష్యత్తులో ఏ ఉప ఎన్నికల్లో, ముఖ్యంగా యూపీలో తమ పార్టీ పోటీ చేయదని ఆమె ప్రకటించారు. యూపీలో జరిగిన 9 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోయింది. ‘గతంలో బ్యాలెట్ పద్ధతి అమల్లో ఉన్నప్పుడు వ్యవస్థను దుర్వినియోగం చేసి, తరచూ మోసం చేసి నకిలీ ఓట్లు వేసేవారు. ఇప్పుడు ఈవీఎంలను ఉపయోగించి అదే పద్ధతిలో నకిలీ ఓట్లు వేస్తున్నారు. ’ అని మాయావతి ఆరోపించారు.