న్యూఢిల్లీ : చీరకట్టుతో అవలీలగా నదిలోకి దూకుతున్న మహిళల వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమిళనాడులోని తమిరబరని నది వద్ద ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
Awestruck to watch these sari clad senior women effortlessly diving in river Tamirabarni at Kallidaikurichi in Tamil Nadu.I am told they are adept at it as it is a regular affair.😱Absolutely inspiring 👏 video- credits unknown, forwarded by a friend #women #MondayMotivation pic.twitter.com/QfAqEFUf1G
— Supriya Sahu IAS (@supriyasahuias) February 6, 2023
20 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ క్లిప్‌లో చీరకట్టులో ఉన్న పలువురు మహిళలు తమిరబరణి నదిలోకి చలాకీగా దూకుతుండటం కనిపిస్తుంది. ఈ మహిళలకు ఇది అతి సాధారణ వ్యవహారమేనని సాహు చెప్పుకొచ్చారు.తమిరబరణి నది తమిళనాడులోని కల్లిదైకురిచిలో ఉంది.
ఈ మహిళలు చీరకట్టుతో సునాయాసంగా నదిలోకి దూకడం గొప్పవిషయమని, ఇది వీరికి సాధారణమేనని, ఈ ఫీట్ స్ఫూర్తిదాయకమని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 17,000కుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అద్భుత వీడియో హ్యాపీ మండే అని ఓ యూజర్ కామెంట్ చేయగా, అమేజింగ్ అని మరో యూజర్ మహిళలపై ప్రశంసలు గుప్పించారు.