లక్నో: అర్ధరాత్రి వేళ ఒక మహిళ పొరుగింటి డోర్‌కు నిప్పుపెట్టింది. (Woman Sets Neighbour’s Door On Fire) ఆ ఇంటి వారు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. పొరుగింటి మహిళ ఇది చేసినట్లు తెలిసి షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖై ఖేడా గ్రామానికి చెందిన ఒక మహిళ శనివారం అర్ధరాత్రి వేళ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఒంటినిండా కప్పుకున్న ఆమె ఆ వీధిలో నడిచి ఒక ఇంటి వద్దకు వెళ్లింది. ఆ ఇంటి తలుపునకు నిప్పంటించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయింది.
కాగా, తలుపు వద్ద మంటలు గమనించిన ఆ ఇంట్లోని వారు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. అదే వీధికి చెందిన మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేశారు.
మరోవైపు ఆ మహిళ ఏ ఉద్దేశంతో ఇలా చేసింది?, వర్గాల మధ్య గొడవలు సృష్టించేందుకేనా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతంలో కూడా ఇలా చేసిందా? అన్నది ఆరా తీస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मुजफ्फरनगर
⏩सिरफिरी महिला की हरकत CCTV कैमरे में हुई कैद
⏩घर के दरवाज़े में आग लगाने की घटना CCTV में कैद, माहौल खराब करने की कोशिश
⏩देर रात्रि सड़कों पर उतरी सिरफिरी महिला पड़ोसी घर के दरवाज़े में लगाई आग
⏩आग लगाती सिरफिरी महिला CCTV कैमरे में हुई कैद
⏩पीड़ित परिवार ने… pic.twitter.com/g7XRFLRea5
— हिन्दी ख़बर | Hindi Khabar 🇮🇳 (@HindiKhabar) January 12, 2025