చికెన్, పనీర్‌లో ఏది రుచికరంగా ఉంటుందనే అంశంపై వెజిటేరియన్లు, నాన్ వెజిటేరియన్ల మధ్య చర్చ ఎన్నటికీ ముగిసేది కాదు. తాన్యా భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌తో ఈ వ్యవహారంపై మరోసారి హాట్ డిబేట్ (Viral Post) నడిచింది.
Unpopular opinion Paneer is better than Chicken> pic.twitter.com/r1Uelv2AI2
— Tanya Bhardwaj (@DitforTit) March 21, 2023
చపాతీ, పనీర్, కెచప్‌తో పాటు ఓ కప్పు కాఫీతో కూడిన తన మీల్స్ ఫొటోను తాన్య ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ చికెన్ కంటే పనీర్ మెరుగైనదని రాయడంతో ఆన్లైన్లో చర్చకు తెరలేచింది. అన్‌పాపులర్ ఆనియన్ పనీర్ చికెన్ కంటే బెటర్ అని తన పోస్ట్‌కు తాన్య క్యాప్షన్ ఇచ్చారు.
అయితే కామెంట్స్ సెక్షన్లో కొందరు తాన్య అభిప్రాయంతో ఏకీభవించగా పలువురు విభేధించారు. పనీర్‌కు మీరు ఓవర్రేటింగ్ ఇచ్చారని ఓ యూజర్ కామెంట్ చేయగా రోటీ ఫొటోను రబ్బర్ అని మరొకరు ఎద్దేవా చేశారు. మీరు చెబుతున్న ఆహారం జైల్లో పెడతారని మరో యూజర్ చురకలు వేశారు.