Instagram Reels | అక్కా తమ్ముళ్లను కలిపిన ఇన్‌స్టా రీల్.. ఎలాగంటే?
ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన హీరోనో, హీరోయిన్నో 15, 20 ఏండ్ల తర్వాత వారి పుట్టుమచ్చ ద్వారానో, మరో గుర్తు ద్వారానో కుటుంబ సభ్యులు గుర్తుపట్టి అక్కున చేర్చుకునే ఉద్విగ్నభరిత దృశ్యాలు మనం చాలా సినిమాల్లో చూశాం.
Instagram Reels | కాన్పూర్, జూన్ 29: ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన హీరోనో, హీరోయిన్నో 15, 20 ఏండ్ల తర్వాత వారి పుట్టుమచ్చ ద్వారానో, మరో గుర్తు ద్వారానో కుటుంబ సభ్యులు గుర్తుపట్టి అక్కున చేర్చుకునే ఉద్విగ్నభరిత దృశ్యాలు మనం చాలా సినిమాల్లో చూశాం. ఇప్పుడు అలాంటి ఘటనే యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. చిన్నప్పుడు ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన తమ్ముడిని ఒక అక్క ఇన్‌స్టా రీల్లో అతని విరిగిన పన్ను ద్వారా గుర్తు పట్టింది. అయితే ఈ ఘటన అతడు వెళ్లిపోయిన 18 ఏండ్ల తర్వాత జరగడం.. దానికి ఇన్ స్టా రీల్ కారణం కావడం విశేషం.
యూపీలోని హతిపూర్‌కు చెందిన రాజ్‌కుమారి మొబైల్లో ఒక రీల్స్ వీడియో చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన అతని పన్ను చూసి 18 ఏండ్ల క్రితం ఇంట్లోంచి ముంబై వెళ్లిన తన తమ్ముడు బాల్ గోవింద్‌లా ఉన్నాడని అనుమానించింది. ఇన్‌స్టాలో అతడిని సంప్రదించి చిన్నప్పడు తాను తమ్ముడితో గడిపిన విషయాలు ప్రస్తావించింది. వాటికి అతడు కూడా సరిగ్గా స్పందించడంతో అతడు తన తమ్ముడేనని నిర్ధారణ అయ్యింది. దీంతో జైపూర్‌లో ఉంటున్న అతడు 18 ఏండ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తప్పిపోయిన తన తమ్ముడిని సామాజిక మాధ్యమమే కలిపిందని రాజ్‌కుమారి ఎంతో ఉద్విగ్నంగా పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

