లక్నో: ఒక మహిళ రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు పట్టాలు దాటుతున్నది. అయితే ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కడంలో ఇబ్బందిపడింది. ఇంతలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు ఆ పట్టాలపై వేగంగా వస్తున్నది. గమనించిన అక్కడి సిబ్బందిలో ఒకరు వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ మహిళ వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చేయిపట్టి ఫ్లాట్‌ఫామ్‌పైకి లాగాడు. ఆమె బ్యాగును కూడా పక్కకు తీశాడు. అయితే ఆ మహిళ వాటర్ బాటిల్ కోసం తిరిగి ప్లాట్‌ఫామ్ అంచు వరకు వెళ్లింది. ఇంతలో రైలు వేగంగా దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో కొందరు యూజర్లు పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మహిళను తృటిలో రైలు ఢీకొనే ముప్పు నుంచి కాపాడిన రైల్వే సిబ్బంది రామ్ స్వరూప్ మీనాను నెటిజన్లు అభినందించారు. అయితే ఆ మహిళ వాటర్ బాటిల్ కోసం తిరిగి ప్లాట్‌ఫామ్ అంచునకు వెళ్లడాన్ని కొందరు తప్పుపట్టారు. వాటర్ బాటిల్ కంటే ప్రాణం ఎంతో ఖరీదైందని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ మహిళను శిక్షించాలని కొందరు డిమాండ్ చేశారు.
शिकोहाबाद रेलवे स्टेशन की ये तस्वीर है। एक महिला को रेल कर्मचारी राम स्वरुप मीणा जी ने बड़ी मुश्किल से बचाया क्योंकि महिला ने ट्रेन को अपनी जान का नजराना दो बार पेश करने की कोशिश की। देखिए कैसे?? pic.twitter.com/eIy31Qzklp
— Ravish Ranjan Shukla (@ravishranjanshu) September 10, 2022