Watch: యువతిని వేధించిన వ్యక్తి.. చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు
Woman beats man with slipper | ఒక వ్యక్తి యువతిని వేధించాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అంతా చూస్తుండగా ఆ వ్యక్తిని యువతి చెప్పుతో కొట్టింది (Woman beats man with slipper). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఒక వ్యక్తి యువతిని వేధించాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అంతా చూస్తుండగా ఆ వ్యక్తిని యువతి చెప్పుతో కొట్టింది (Woman beats man with slipper). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన వ్యక్తి తనను వేధిస్తున్నట్లు ఒక యువతి ఆరోపించింది. దీని గురించి గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసింది.
కాగా, ఆ గ్రామ పంచాయతీ వినూత్నంగా తీర్పు ఇచ్చింది. వేధిస్తున్న యువకుడ్ని చెప్పుతో కొట్టాలని ఆ యువతికి చెప్పింది. దీంతో పంచాయతీ తీర్పును ఆ యువతి అమలు చేసింది. జనమంతా చూస్తుండగా ఆ వ్యక్తిని చెప్పుతో పలుమార్లు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పంచాయతీ తీర్పుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Chappal kalesh b/w a Girl and a Guy over Harrasingg and Mosbehaving with the girl in Hapur,UP pic.twitter.com/cSx7sAkvW3
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 17, 2023
మరోవైపు ఈ ఏడాది జూన్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో కూడా ఇలాంటి తరహా సంఘటన జరిగింది. ఒడిశాలోని బెహ్రాంపూర్కు చెందిన అక్కాచెల్లెళ్లు, తమను వేధిస్తున్న వ్యక్తిని బహిరంగంగా కొట్టారు. స్కూల్ డ్రెస్లో ఉన్న ఆ బాలికలు అంతా చూస్తుండగా ఒక వ్యక్తిని బెల్ట్తో చితకబాదారు. ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Ahmedabad: 2 teen sisters confront a molester. They fought him off when the man tried to molest the school going girl. pic.twitter.com/yeGQCo49pK
— sanjana (she/her) (@sanjanausd08) June 24, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

