watch: భర్తను కొట్టి హింసిస్తున్న భార్య.. రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్న బాధితుడు
Wife Beats Husband | భార్య, అత్తింటి వారు తనను కొట్టి హింసిస్తున్నారని భార్త వాపోయాడు. భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. రహస్యంగా రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ను పోలీసులకు అందజేశాడు.
భోపాల్: భార్య, అత్తింటి వారు తనను కొట్టి హింసిస్తున్నారని భార్త వాపోయాడు. (Wife Beats Husband) భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. రహస్యంగా రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ను పోలీసులకు అందజేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 20న భర్త లోకేష్‌ను భార్య హర్షిత దారుణంగా కొట్టింది. చేతులు జోడించి అతడు వేడున్నప్పటికీ కనికరించలేదు. మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. లోకేష్ చెంపలు వాయించింది. ముఖంపై కాలితో తన్నింది. కాలర్ పట్టుకుని పలుమార్లు కొట్టింది.
కాగా, భార్య హర్షిత, అత్తింటి వారు తనను కొట్టి హింసిస్తున్నారని లోకేష్ వాపోయాడు. పేద కుటుంబానికి చెందిన ఆమెను ఎలాంటి కట్నం తీసుకుకోకుండా 2023 జూన్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. అయితే పెళ్లి తర్వాత నుంచి భార్య, అత్త, బావమరిది డబ్బులు, బంగారు నగలు కావాలని తనను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. తాను నిరాకరించడంతో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు.
మరోవైపు భార్య, అత్తింటి వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి లోకేష్ ఫిర్యాదు చేశాడు. రహస్యంగా రికార్డ్ చేసిన భార్య కొడుతున్న వీడియో క్లిప్‌ను అందజేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‘My wife beats me sir, save me from my wife sir’
Lokesh submitted an application to the Superintendent of Police office in Panna, Madhya Pradesh, narrating the story of his own wife’s cruelty and requested for help. CCTV footage of his wife beating him came to light. pic.twitter.com/gA7mSOvbP4
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 2, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

